Header Banner

వైసీపీకి మరోసారి దెబ్బ మీద దెబ్బ! ఒకే రోజు రెండు వరుస షాకులు!

  Mon May 19, 2025 17:43        Politics

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కదిరి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది, దిల్షా దున్నీషా ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన శరత్‌బాబు గెలుపొందారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. శ్రీ సత్యసాయిజిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక కూడా వాయిదా పడింది, విశాఖపట్నం డిప్యూటీ మేయర్ ఎన్నిక సైతం వాయిదా పడింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే.. ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా షాక్ తప్పడం లేదు. ఇవాళ మరోసారి స్థానిక సంస్థలకు సంబంధించిన పదవుల కోసం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.. వైఎస్సార్‌సీపీకి మరికొన్ని పదవులు చేజారాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరింది. మున్సిపల్ చైర్ పర్సన్‌గా దిల్షా దున్నీషా..వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారి సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ గెలుపుతో మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.. అయితే ఈ ఎన్నికను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 ఉంటే.. 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అంతకముందు బెంగళూరు క్యాంప్‌లో ఉన్న టీడీపీ కౌన్సిలర్లు.. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్‌ ఎన్నిక.. అనంతరం వైస్ చైర్మన్ల ఎంపిక ఏకగ్రీవమైంది.

 

ఇది కూడా చదవండిశ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

మరోవైపు విజయనగరం జిల్లా బొబ్బలి మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన శరత్‌బాబు ఎన్నికయ్యారు. గత నెల 29న గత ఛైర్మన్‌ మురళీకృష్ణారావుపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఇవాళ అవిశ్వాస ఓటింగ్‌లో టీడీపీ గెలవడంతో మురళీకృష్ణారావు ఛైర్మన్‌ పదవి కోల్పోయారు. 20 మంది సభ్యుల మద్దతుతో బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి ఖాతాలోకి చేరింది.ఇక తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదాపడింది.. కోరం లేకపోవడంతో మంగళవారానికి ఎన్నిక వాయిదా వేశారు. మొత్తం 20 మందికి గాను ఏడుగురు మాత్రమే హాజరుకావడంతో వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. శ్రీసత్యసాయిజిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్హాజరుకావడంతో ఎన్నిక వాయిదా పడింది. గతంలో కోరం లేక ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది.

 

ఇటు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఉన్నతాధికారులు ఈ ఎన్నిక మంగళవారానికి వాయిదా వేశారు.డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 56 మంది కార్పొరేటర్లు కావాల్సి ఉండగా.. సోమవారం 54 మంది మాత్రమే వచ్చారు. ఈ కారణంతోనే ఎన్నిక వాయిదాపడింది. డిప్యూటీ మేయర్ పదవి జనసేన పార్టీకి కేటాయించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #YSRCP #PoliticalShock #AndhraPolitics #BreakingNews #PoliticalDrama #APPolitics #YSRCPSetback #TeluguNews #LatestUpdate